ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న క్రైస్తవ పరిభాష | ఇకనుండి మనం వాడాల్సిన క్రైస్తవ పరిభాష | ||
1. | ప్రియమైన వారలారా... (తెలుగు నేర్చుకున్న విదేశీయులు కొన్ని పదాలను బైబిల్ అనువాదంలోనే పొరపాటుగా వ్రాసారు. ఆ రోజులు వేరు. ఈ తరాలు వేరు. ఆ పొరపాటు పదాలను ఇప్పుడు మనం మార్చుకోవచ్చు.) | 1. | ప్రియ సోదరులారా... / మిత్రులారా... / స్నేహితులారా... / సోదర సోదరీ మణులారా... / సభికులారా... |
2. | కూటము, కూడిక | 2. | సభ, సదస్సు |
3. | స్తుతి | 3. | ప్రణామం |
4. | వందనాలు (ఇద్దరు వ్యక్తులు కలసినప్పుడు నమస్కారాలు చెప్పుకుంటారు. వందనాలు అంటే కృతజ్ఞతలు, ధన్యవాదాలు వంటి పదాలకు సమానం గానీ నమస్కారానికి సమానం కాదు. తెలుగు బైబిల్లో ముఖ్యంగా పౌలు పత్రికలలో అనువదించబడిన "వందనములు" అనే పదం అనువాదకుల పొరపాటు.) | 4. | నమస్కారం, నమస్తే, అభివందనం. |
5. | ప్రేమించవలసిన వారమైయున్నాము. (...వారమైయున్నాము అనే పదం సామాన్య భాషలో చాలా అరుదుగా వాడతారు. | 5. | ప్రేమించుదాం, అభిమానించుదాం, ఇష్టపడదాం. దేవుని విషయంలోనైతే పూజించాలి. |
6. | రక్షణ (దీన్ని మార్చమంటే నన్ను కొట్టినా కొడతారు. అయినా తప్పదు. ఈ మాట వెనుకనున్న భావన, తలంపు, దృక్ఫథం కేవలం క్రైస్తవులకే అర్ధం అవుతుంది తప్ప క్రైస్తవేతరుల దృష్టిలో రక్షణ అంటే భద్రత లేక పోలీసు రక్షణ. హిందూ భావజాలం లోని ముక్తి, మోక్షం అనే పదాలు మన "రక్షణ" అనే పదానికి సమానం కావు. ఎందుకంటే వాళ్ళ భావనలో జన్మలన్నిటినీ దాటిన తరువాత గాని, ముక్తి కలుగదు, మోక్షం రాదు. కాబట్టి ప్రస్తుతానికి "రక్షణ" అనే మాటకు బదులుగా వాళ్ళకు అర్ధమయ్యే వేరే మాటలు వాడుకుందాం.) | 6. | పాప విముక్తి, పాప విమోచన |
7. | మహిమ (క్రైస్తవేతరులు "మహిమ" అనే పదాన్ని "అద్భుతం" అనే అర్ధంతోనే వాడతారు. ఉదా: బాబా మహిమలు చేస్తాడు, మాకు ఎన్నో మహిమలు జరిగాయి...) | 7. | కీర్తి, ప్రతిష్ట, ఘనత |
8. | ఆత్మీయత (ఈ పదానికి ఆప్యాయత అనే అర్ధం ఉంది. Spiritual అనే మాటకు ఆత్మీయ అనే పదం సరైన అనువాదం కాదు.) | 8. | ఆధ్యాత్మిక, ఆత్మ సంబంధమైన |
9. | పొందుకోవడం (పొందుకొను అనే పదం తెలుగు భాషలోనే లేదు.) | 9. | పొందుట, పొందడం |
10. | తలాంతు (ఇది కొన్ని దేశాలలో ఒక Unit of money. రూపాయి, డాలర్, పౌండ్, యూరో, దీనార్ ఎలాంటివో తలాంతు కూడా అలాంటిదే. అయితే దీనికి వేరే అర్ధం కలిపించి బైబిల్ భాషలో వరములు, వరప్రసాదములు అనే అర్ధంతో వాడుతున్నాం) | 10. | ప్రతిభ, ప్రజ్ఞ, ప్రజ్ఞా పాటవాలు (ఇలాంటివి మరెన్నో పర్యాయ పదాలు సమానార్ధకాలు ఉన్నాయి.) |
11. | పరిశుద్ధ గ్రంథం (హోలీ బైబిల్ అనే పదాన్ని పరిశుద్ధ గ్రంథం అని అనువదించారు మన పూర్వికులు. సామాన్యులు పరిశుద్ధ అనే మాట పరిశుభ్ర అనే మాటగా అర్ధం చేసుకుంటారు. ఉదా: పారిశుధ్య కార్మికులు.) బైబిల్ అని చెబితే అది క్రైస్తవుల మత గ్రంథం అనే అవగాహన క్రైస్తవేతరులకు ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథం అనే మాట మనకు ఇన్ని తరాలుగా అలవాటయ్యక దాన్ని మార్చడం సబబు కాదేమో. అలాగే పరిశుద్ధుడు అనే మాటను మార్చడానికి సాహసించలేం. అది అలా ఉండాల్సిందే. | 11. | పవిత్ర గ్రంథం (క్యాథలిక్ సోదరులు, కృపా పరిచర్యవారు హోలీ బైబిల్ ను ఇలాగే అనువదించారు. ఇది అందరికీ బాగా అర్ధం అయ్యే మాట.) సాధ్యమైనంత వరకు పరిశుద్ధ అనే మాట వచ్చినపుడల్లా పవిత్ర అనే మాటను ఉపయోగించ డానికి ప్రయత్నం చేద్దాం. |
12. | మారు మనసు (మారిపోయిన మనసు అని మన అర్ధం. అయితే మారుమనసు పొందాలి అనే మాట సామాన్యులు సాధారణంగా వాడరు.) | 12. | పరివర్తన, మనసులో మార్పు (పరివర్తన రావాలి, మనసులో మార్పు కావాలి) |
13. | అన్యులు, అన్య జనాంగం (మనం ఈ మాటలను క్రైస్తవేతరులు అనే అర్ధం తో వాడతాం. కానీ ఈ మాట వాళ్ళకు అసలు అర్ధం కాదు. పైగా అది వారిని నొప్పిస్తుంది. "మీరు అన్యులు" అని వారిని అంటూ వారికి యేసు క్రీస్తు శుభవార్త ఎలా చెప్పగలం? ఆలోచించండి.) | 13. | క్రైస్తవేతరులు, ఇతర విశ్వాసాల వారు, ఇతర మతాల వారు. |
14. | చెల్లించుట (స్తుతులు చెల్లించుట అని మనం సాధారణంగా వాడతాం. కానీ క్రైస్తవేతరులు ఈ పదాన్ని అప్పులు చెల్లించడం, పన్నులు చెల్లించడం వంటి సందర్భాలలోనే వాడతారు.) | 14. | స్తుతులు సమర్పించుట, అర్పించుట, స్తుతి చేయుట, నివేదించుట |
15. | అవసరతలు | 15. | అవసరాలు |
16. | తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు (పాస్టర్లు ఆశీర్వాదం ఇచ్చేటపుడు ఈ మాటలు వాడతారు. అయితే "యొక్కయు" అనే మాట లేకుండానే ఆ అర్ధం వస్తుంది కదా. అలంటపుడు దీన్ని మానుకోవడం మంచిది.) | 16. | తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ (ఇందులో యొక్కయు లేకపోయినా భావం చెడిపోలేదు. "తలిదండ్రుల ఆస్తి" అంటాము గాని "తల్లి యొక్కయు తండ్రి యొక్కయు ఆస్తి" అని చెప్పం కదా.) |
17. | ఈ ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో, రాత్రి కాల సమయంలో (కాలం అన్నా సమయం అన్నాఒకటేనన్న విషయం స్ఫురించక ఇలా వాడేస్తారు మన వాళ్ళు) | 17. | ఈ ఉదయం, ఈ సాయంకాలం, ఈ రాత్రి (ఇలా చెప్పడం సుళువుగా ఉంటుంది) |
18. | యథార్థవంతులు, యథార్థ వర్తనులు | 18. | ఈ మాట సాధారణంగా క్రైస్తవేతరులు వాడరు, కాబట్టి అది వారికి అర్ధం అవ్వాలంటే మనం "సత్యవంతులు, సత్యవర్తనులు" అనే మాటలను వాడాల్సి ఉంటుంది. |
19. | బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. | 19. | బైబిల్ అంటేనే గ్రంథం అని అర్ధం. కాబట్టి బైబిల్ అని చెబితే చాలు. దానికి మళ్ళీ గ్రంథం అనే మాట కలపనక్కర లేదు. వ్రాయబడి ఉంది అనడానికి బదులు "వ్రాసారు" అని చెబితే చాలు. వ్రాయబడి, చెప్పబడి ఇల్లంటి Passive Voice ను వాడుక భాషలో ఎవరూ వాడరు. |
20. | లేఖనములు శెలవిస్తున్నాయ్. (క్రైస్తవేతరులకు ఈ మాటలు ఏమైనా అర్ధం అవుతాయా? భాగవత రామాయణాలు ఇలా శెలవిస్తున్నాయ్ అని వారంటారా?) | 20 | బైబిల్ చెప్తున్నది. బైబిల్లో ఉంది. బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. |
21. | అపవాది, దుష్టుడు (బైబిల్ పరిచయం లేని మన మిత్రులకు ఈ పదాలు ఛస్తే అర్ధం కావు. పైగా కంగారు పడతారు కూడాను) | 21. | సైతాన్, దైవ సంబంధ విషయాలకు శత్రువు. (సైతాన్ అన్న మాట క్రైస్తవేతరులందరికీ అర్ధం అవుతుంది. ఎందుకంటే "అగ్గిపుల్ల గీసేసెయ్, నీలో సైతాన్ తరిమేసెయ్" అని సినీ గేయ రచయిత వ్రాసాడు కదా) |
22. | వేషధారులు (మారు వేషం వేయడం, సినిమాల్లో, డ్రామాల్లో వేషం వేయడం - ఇలాంటి అర్ధాలే బయటి వారికి స్ఫురిస్తాయి గానీ మనం ఏ అర్ధంతో ఆ పదాన్ని వాడుతున్నామో వారికి తెలియదు) | 22. | కపటులు, కపటంగా ప్రవర్తించే వారు. (ఒక్కోసారి కపట వేషధారులు అని కూడా మనం వాడవచ్చు.) |
23. | దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు చెప్పాడు. (క్రైస్తవేతరులు ఈ మాటలు విని జడుసుకుంటారు.) | 23. | నాతో దేవుడు మాట్లాడినట్టు అనిపించింది. అలా స్ఫురించింది. దేవుడు నాతో మాట్లాడిన భావన కలిగింది. దేవుడు నాకు ఇలా స్ఫురింప జేసాడు. |
24. | విశ్వాసులు, అవిశ్వాసులు (యేసు క్రీస్తును తమ స్వంత రక్షకునుగా అంగీకరించిన వారిని విశ్వాసులని, అలా చేయని ఇతరులను అవిశ్వాసులని మనం పిలుస్తాం. క్రైస్తవేతరులైన మన స్నీహితులకు ఈ మాటలు ఏమాత్రం అర్ధం కావు) | 24. | క్రైస్తవేతరులకు అర్ధం అయ్యే సమానార్ధకాలు లేనే లేవు. ఆస్తికులు, నాస్తికులు, దేవుని మీద నమ్మకం ఉంచేవారు, నమ్మకం ఉంచని వారు, క్రీస్తు అనుచరులు, క్రైస్తవేతరులు అనే మాటల్ని మనం ప్రస్తుతానికి వాడదాం. |
25 | |||
26 | |||
27 | దర్శనములు, భాషలు | 27 | దర్శనము అనే మాటకు బదులు కల అనే మాట వాడితే వారికి సులువుగా అర్ధం అవుతుంది. ఇతర భాషలు మాట్లాడుట అనే భావన ఇతర మతాలలో లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మాట వాడకపోవడమే మంచిది. |
28 | రాకడ, ఎత్తబడుదురు | 28 | దే్వుడు దిగి వచ్చి తన భక్తుల్ని పరలోకానికి తీసుకు వెళ్ళడం అనే భావన ఇతర మతాలలో లేదు. కాబట్టి కేవలం ఈ పదాలు పలికి విడిచిపెట్టకుండా వాటిని పూర్తిగా వివరించడం మంచిది. |
29 | లోక రక్షకుడు | 29 | మానవులందరినీ వారి పాపముల నుండి విడిపించి కాపాడువాడు. లోకములో ఉన్న నరులందరినీ నరక శిక్ష నుండి రక్షింపగలవాడు. |
30 | స్వతంత్రించుకొనుట | 30 | స్వంతం (సొంతం) చేసుకొనుట |
31 | వాక్యం చెప్పుట, వాక్యం ముగించుట అనే మాటలు మనం పలికినపుడు మన అర్ధం ఏమిటంటే బైబిల్ వర్తమనాన్ని చెప్పడం, ముగించడం. | 31 | ఇది క్రైస్తవేతరులకు అర్ధం కాదు. వాక్యం అంటే కొన్ని మాటలు అని మాత్రమే వాళ్ళకు అర్ధం అవుతుంది. కాబట్టి "బైబిల్ వాక్యాలు" అని చెపితే బాగుంతుంది. లేకపోతే ప్రసంగం, సందేశం, వర్తమానం అనే మాటలు కూడా మనం వాడవచ్చు. |
32 | ధన్యత, ధన్యతలు (ఇవి బయట ప్రపంచంలో వాడుకలో లేవు) | 32 | ధన్యుడు, ధన్యురాలు అనే మాటలు క్రైస్తవేతరులకు అర్ధం అవుతాయి. |
33 | ప్రేరేపణ | 33 | పారవశ్యం |
34 | నిర్మలత | 34 | పవిత్రత |
35 | స్నేహితా... | 35 | స్నేహితులారా... |
36 | మనుష్య కుమారుడు | 36 | మానవ అవతారుడైన దేవుడు. |
37 | దేవుడు నమ్మదగినవాడు | 37 | దేవుడు నమ్మకస్తుడు |
38 | నిరీక్షణ: దీన్ని మనం Hope అనే అర్ధం తో వాడుతుంటాము. (ఉదా: ప్రభువునందు నిరీక్షణ కలిగియుండుట) ఈ పదాన్ని విశ్వాసం అనే అర్ధం తో కూడా వాడుతుంటాము. (ఉదా: మనం నిరీక్షణ కలవారిగా ఉండాలి.) | 38. | ఆశతో వేచియుండుట, ఆశగా ఎదురుచూచుట ... ఇలా చెపితే క్రైస్తవేతర సోదరులకు సులభంగా అర్ధం అవుతుంది. |
39. | సమాడానం: క్రైస్తవ పరిభాషలో సమాడానం అంటే ఇద్దరి మధ్య తగువు లేకుండా ఇద్దరూ మిత్రులుగా ఉండటం. దేవునితో సమాడానం కలిగి ఉండటమంటే దేవునికి వ్యతిరేకంగా కాకుండా ఆయనకు విధేయులుగా ఉండంటం. | 39. | క్రైస్తవేతరులు ఈ పదాన్ని జవాబు అనే అర్ధంతో వాడతారు.కాబట్టి వారికి అర్ధం అయ్యేలా దేవునితో మనం సన్నిహితంగా ఉండాలి. ఆయనకు ఇష్టులముగా ఉండాలి అని చెపితే బాగుంటుంది. |
40. | అసహ్యులు: సమాజానికి అసహ్యకరమైఅనవారు అని మన అర్ధం. నశించువారు: అంటే క్రైస్తవులు కానివారు అని మన అర్ధం. అయితే ఈ మాటలు ఇతరులకు అర్ధం కావు. | 40. | సువార్తకు అనుకూలంగా స్పందించే వారికి ఈ మాటలు దూషణ మాటలుగా అనిపిస్తాయి. కాబట్టి సమానార్ధకాలు తెలియకపోతే ఆ పదాలను పూర్తిగా వాడకపోవడమే మంచిది. అసహ్యులు అనే మాటకు బదులుగా చెడ్దపనులు చేసేవారు అని, నశించువారు అనే మాటకు బదులుగా ప్రభువును విశ్వసించని వారు అని అంటే వారు నొచ్చుకోరు. |
41 | కృపావరములు | 41. | కృపతో దేవుడు వారికి అనుగ్రహించిన వరములు అని వివరంగా చెబితే సులువుగా అర్ధం అవుతుంది. |
42 | మహిమపరచుట, మహిమ పొందుట | 42. | ఘనపరచుట, ఘనత పొందుట |
43. | సువార్త | 43. | శుభవార్త: యేసు క్రీస్తు మనవ అవతారం, పరిశుద్ధ జీవితం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన సిలువ మరణం, పునరుత్థ్హా్నం, పరలోక ఆరోహణం, ఆయన రెండవ రాకద, వెయ్యేళ్ళ పరిపాలన, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి,, యుగయుగాల ప్రభువు పరిపాలనతోకూడిన పరమ రాజ్యం... ఇవన్నీ కలిస్తే వచ్చేది శుభవార్త. క్రైస్తవేతరులకు శుభవార్త అని ఒక్కముక్క చెబితే చాలదు. వీటన్నిటినీ వివరించి శుభవార్త లో ఇవన్నీ ఉన్నాయి అని వారికి చెప్పాలి. |
Saturday, 7 January 2012
మన తెలుగు సరిచేసుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment