Tuesday, 3 January 2012

క్షమాపణ లభించిందా? మనం దేవుని నుండి క్షమాపణ ఎలా పొందగలం?

సమాధానము: అ.కా. 13:38“సహోదరులారా, మీకు తెలియచేసే విషయం ఏమిటంటే యేసు క్రీస్తు ద్వారానే మీ పాపములు క్షమింపబడుతాయి” అని ప్రకటించబడింది.


క్షమాపణ అంటే ఏమిటి మరియు నాకెందుకది అవసరం?


“క్షమాపణ” అనే పదానికి అర్థ౦ పలకను శుభ్రంగా తుడిచివేయడం, క్షమించడ౦ , ఋణాన్ని రద్దు చేయటం అన్నమాట. మనము తప్పు చేసినప్పుడు తిరిగి మన సంబంధాలను కలుపుకోవటానికి క్షమాపణ కొరకు ఎదురుచూస్తాము. ఎందుకంటే ఒక వ్యక్తి క్షమించబడుటకు అర్హుడు అనుకున్న౦త మాత్రాన అతనికి క్షమాపణ ఇవ్వబడదు


క్షమాపణ అనేది ప్రేమ, దయ మరియు కనికరము అనే క్రియలతో కూడినది. క్షమాపణ అనేది మీకు ఏది చేసినప్పటికీ, ఎదుటి వ్యక్తికి వ్యతిరేకముగా వారు చేసినది ఏదైనా గట్టిగా పట్టుకోవటం కాదు.


బైబిల్ ఏం చెపుతుందంటే మన౦దరికీ దేవుని నుండి క్షమాపణ పొందవలసిన అవసరము ఎంతైనా ఉ౦ది. మనమందరము పాపము చేసాము. ప్రసంగి 7:20 లో, “పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు”. “1 యోహాను 1:8 లో మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొన్నట్లవును , మరియు మనలో సత్యముండదు”. కీర్తనలు 51:4 లో చెప్పినట్లుగా నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసియున్నాను, నీ దృష్టి యెదుట చెడుతనము చేసియున్నాను. దీని ఫలితమే, మనందరికి ఖచ్చితంగా క్షమాపణ అవసరమై ఉన్నది. మన పాపములు క్షమింపబడనియెడల (మత్తయి 25:46: యోహాను 3:36) ప్రకారము మన పాపముల విషయమై మనము నిత్యశిక్షకు పాత్రులగుదుము.


క్షమాపణ—అది నేను ఎలా తెచ్చుకోగలను?


కృతజ్ఙతపూర్వకంగా, దేవుడు ప్రేమ మరియు దయగలవాడు—ఆయన మన పాపములను క్షమించటానికి ఎంతో ఆసక్తి కలవాడు. 2 పేతురు 3.9 లో మనకు తెలుపుతుంది... “ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నారు”. ఆయన మనలను క్షమించాలని కోరుకుంటున్నారు, అందుకే మనకొరకు క్షమాపణ ఏర్పాటు చేసారు.


మన పాపములకు వెల కేవలము మరణము. రోమా మొదటి సగభాగంలో 6:23లో “పాపము వలన వచ్చు అపరాధము మరణము”…. మన పాపముల వలన మనము సంపాదించుకున్నది నిత్య మరణము. దేవుడు తన ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా యేసు క్రీస్తు రూప౦లో ఈ భూమి మీద అవతరించి మనకు రావాల్సిన శిక్షను శిలువపై చనిపోవుట ద్వారా మనకొరకు వెల చెల్లించారు. 2 కొరింథి 5:21 లో, "మనము ఆయనయందు దేవుని నీతి అగునట్లుగా, ఏ పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను”.యేసు శిలువ మీద చనిపోయి, మనకు చెందవలసిన శిక్షను ఆయన తీసుకొనెను. దేవుడిగా యేసు యొక్క మరణము సమస్త మానవాళి పాపములకు క్షమాపణ అందచేయబడినది! (1 యోహాను 2:2) ప్రకారము ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకపాపపరిహారము కొరకై త్యాగధనులై ఉన్నారు. ( 1 కొరింథి 15:1-28 ) యేసు మరణము నుండి లేచి, పాపము మరియు మరణము మీద విజయము సాధించారని ప్రకటించబడింది. దేవునికి స్తోత్రము, యేసు క్రీస్తు మరణము మరియు పునరుద్ధానము ద్వారా రోమా6:23 రెండవ భాగము లో చెప్పింది నిజము... “కాని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్యజీవనము అనే వరము అనుగ్రహించబడింది”.


మీకు మీ పాపములు క్షమించబడాలి అని ఉ౦దా? మీకు ఈ పాపముల నుండి పారిపోలేననే అపరాధ భావన మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? మీ విశ్వాసాన్ని మీ రక్షకుడైన యేసుక్రీస్తు మీద ఉ౦చిన ఎడల మీ పాపములకు క్షమాపణ అవకాశం కలుగుతుంది. ఎఫెసి 1:7 లో చెప్పినట్లుగా “ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు కలిగి యున్నది”. ఆయన మన అపరాధములకు వెల చెల్లించెను కాబట్టే మన పాపములు క్షమింబడినవి. యేసుద్వారా మీకు క్షమాపణ కలిగిందా అని అడిగితే---నాకు క్షమాపణ ఇవ్వటానికే యేసు చనిపోయారు అని నమ్మినయెడల ఆయన ఖచ్చితంగా మిమ్ములను క్షమిస్తారు. యోహాను 3.16,17 లో చెప్పిన అద్భుతమైన సమాచారము ఏమిటంటే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు ఇచ్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు".


క్షమాపణ—అది నిజముగా చాలా తేలికా?


అవును అది చాలా తేలిక! మీరు దేవునినుండి క్షమాపణ పొ౦దలేరు. దేవుని దగ్గర నుండి మీ క్షమాపణ కొరకు మీరు ఏమి చెల్లించలేరు. దేవుని కృప మరియు కనికరము ద్వారా విశ్వాసంతో మాత్రమే మీరు దానిని పొందగలరు. మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించి మరియు దేవుని వద్దనుండి క్షమాపణ పొందాలంటే ఈ ప్రార్థనను మీరు చేయవచ్చు. ఈ ప్రార్థన చెప్పటం వలన తప్ప మరి ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉ౦చుట ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ లభిస్తుంది. ఈ ప్రార్థన యేసు నందు మనకున్న విశ్వాసాన్ని వివరించటానికి మరియు ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణకు కృతజ్ఞతలు చెల్లించటానికి ఒక సులభమైన మార్గము మాత్రమే. “ప్రభువా! నాకు తెలుసు నేను మీకు విరోధముగా పాపము చేసాను మరియు నేను శిక్షకు పాత్రుడను. కాని యేసు క్రీస్తు నాకు చెందవలసిన శిక్షను తీసుకున్నారనే విశ్వాసం ద్వారా నేను క్షమించబడ్డాను. నా రక్షణ కొరకు నా నమ్మకాన్ని మీపై ఉ౦చుతాను. మీ అద్బుతమైన కృప మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు ! ఆమెన్ !”

No comments:

Post a Comment