Tuesday, 3 January 2012

మరణం తర్వాత ఏమౌతాది?

ప్రశ్న: మరణం తర్వాత ఏమౌతాది?సమాధానము: మరణం తర్వాత ఏంజరుగుద్ది అనే విషయంపై క్రైస్తవ విశ్వాసంలోనే పలు అనుమానాలున్నాయి. మరణం తర్వాత ప్రతి ఒక్కరు అంతిమ తీర్పు వరకు నిద్రిస్తారని, ఆ తర్వాత పరలోకమునకుగాని నరకమునకుగాని పంపబడతారని కొంతమంది నమ్ముతారు. మరి కొందరైతే మరణమైన తక్షణమే తీర్పువుంటుందని నిత్య గమ్యానికి పంపింపబడతారని నమ్ముతారు. మరణము తర్వాత ప్రాణాత్మలు తాత్కాలికమైన పరలోకము లేక నరకమునకు పంపబడతాయని అక్కడ అంతిమ పునరుత్ధానము కోసం వేచియుంటారని, అంతిమ తీర్పు తర్వాత నిత్య గమ్యాలకు పంపబడతారని మరి కొంతమంది చెప్పుతారు. కాబట్టి మరణం తర్వాత ఏమి జరుగుద్ది అన్నదానిని బైబిలు ఏమి చెప్తుంది?మొదటిగా క్రీస్తునందున్న విశ్వాసి బైబిలు చెప్పుతున్నట్లుగా చనిపోయిన తర్వాత అతని/ఆమె ఆత్మ పరలోకమునకు కొనిపోబడతాది. ఎందుకంటే ఆ వ్యక్తి పాపములు క్రీస్తు స్వంతరక్షకునిగా అంగీకరించుటనుబట్టి క్షమించబడినవికాబట్టి యోహాను 3:16.18,36). విశ్వాసునికి మరణము అంటే శరీరమునుండి వేరు పరచబడి ప్రభువుతో యింటికి చేరటమే (2 కొరింథి 5:6-8; ఫిలిప్పీయులకు 1:23). అయితే, 1కొరింథి 15:50-54 మరియు 1థెస్సలోనీయులకు 1: 13-17 ప్రకారము ఒక విశ్వాసి పునరుత్ధానుడై మహిమగల శరీరము ఇవ్వబడినట్లు వివరిస్తున్నాయి. విశ్వాసులు మరణనంతరం క్రీస్తు దగ్గరకు వెళ్ళేవాళ్ళాయితే ఇటువంటి పునరుత్ధానము యొక్క ఉద్డేశము ఏంటి? బహుశా! విశ్వాసులు యొక్క ప్రాణాత్మాలు మరణాంతరం క్రీస్తుదగ్గరకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి భౌతిక దేహము సమాధిలో నిడ్రించునేమో. విశ్వాసులు యొక్క పునరుత్ధాన సమయంలో వారి భౌతికధేహము పునరుత్ధానమై మహిమ శరీరముతో తిరిగి కలుసుకొనును. ఈవిధముగా తిరిగి ఏకపరచబడిన ప్రాణాత్మదేహాలను విశ్వాసులు కలిగియుండి నూతన ఆకాశాములోను నూతనలోకములోను నిత్యత్వములో గడుపుదురు.

రెండవదిగా ఎవరైతే యేసుక్రీస్తుని స్వంతరక్షకునిగా అంగీకరించరో వారికి మరణము అంటే నిత్య శిక్ష. అయితే విశ్వాసులు యొక్క గమ్యము వలే అవిశ్వాసులు కూడ మరణానంతరం ఓ తాత్కలిక ప్రదేశములో ఉంచబడతారు. వారు అంతిమ పునరుత్ధానము, తీర్పు, నిత్యగమ్యము కొరకు వేచియుంటారు. ధనవంతుడు మరణాంతరము శిక్షపొందునట్లుగా లూకా 16: 22-23 వివరిస్తుంది. అవిశ్వాసులైన మృతులు యొక్క పునరుత్ధానమును ప్రకటనగ్రంధం 20: 11-15 వివరిస్తుంది. వారు ధవళమైన మహాసింహాసనపు తీర్పు పొంది అగ్ని గుండములో త్రోయబడుదురు. కాబట్టి అవిశ్వాసులు మరణం తర్వాత అనంతరమే నరకమునకు (అగ్ని గుండంలోనికి) త్రోయబడరు కాని తాత్కలికముగా తీర్పును, శిక్షను అనుభవిస్తారు. అయితే విశ్వాసులు మరణాంతరం అగ్నిగుండంలోనికి త్రోయబడకపోయిన వారి స్థితి సుఖవంతమైంది కాదు. ధనవంతుడు నేను ఈ అగ్ని జ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసెను (లూకా 16:24).

కాబట్టి మరణాంతరం ఓ వ్యక్తి తాత్కలికమైన పరలోకము లేక నరకములో గడుపుతారు/ గడుపుతాడు. తాత్కలిక స్థితి తర్వాత అంతిమ పునరుత్ధానపు సమయంలో ఓ వ్యక్తి నిత్య గమ్యమైతే మారదు. స్థానభ్రమణం తప్పించి నిత్య గమ్యములో మార్పువుండదు. అంతిమముగా ఆ నూతన ఆకాశమునకు, నూతన భూమికి ప్రవేశము అనుగ్రహించబడుతాది. అవిశ్వాసులు అగ్నిగుండమునకు పంపబడుతారు. రక్షణ విషయమై యేసుక్రీస్తుని నమ్మారా లేదా అన్నదానిపై ఆధారపడివున్న అంతిమ నిత్య గమ్యాలు ఇవే.

ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా?

ప్రశ్న: ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా?

సమాధానము:
ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా? యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినవారు దేవునితో సంభంధాన్ని ఏర్పరచుకొనుటయే కాక నిత్య భధ్రతను రక్షణ నిశ్చయతను కల్గి యుంటారు. పలు వాక్యభాగాలు ఈ వాస్తావాన్ని ప్రకటిస్తున్నాయి. ఎ) రోమా 8:30 ఈ విధంగా ప్రకటిస్తుంది. “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” ఈ వచనం ప్రకారం దేవుడు మనలను ఎంపిక చేసిన క్షణమునుండి పరలోకములో ఆయన సన్నిధానములో మహిమ పర్చబడినట్లుగావుంటుంది. దేవుడు ఒక విశ్వాసిని పరలోకములో మహిమపర్చబడటానికి ఏర్పర్చాడు కాబట్టి దేనినుండి ఆపలేడు. దేవుడు ఉద్దేశించిన మహిమనుంచి ఒక విశ్వాసిని ఏది కూడ ఆపలేదు. నీతిమంతుడుగా తీర్పుతీర్చబడినటువంటి వ్యక్తికి రక్షణ ఖచ్చితము. పరలోకములో మహిమ ఉన్నదంతగా రూఢి గల్గినవాడు.



బి).రోమా 8:33-34 లో పౌలు రెండు కీలక ప్రశ్నలు లేవనెత్తుచున్నాడు. “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పుతీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విఙ్ఞాపనముకూడ చేయువాడును ఆయనే.” దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద ఎవరు నేరము మోపగలరు? ఎవరు చేయలేరు ఎందుకంటే క్రీస్తే మన న్యాయవాది. ఎవరు శిక్ష విధించగలరు? ఎవరివలనా కాదు. మనకొరకు చనిపోయిన యేసుక్రీస్తు ఒక్కడే శిక్ష విధించగలడు. మనకు ఒక ఉత్తరవాదిగా, న్యాయవాదిగా ఆయన మనకు ఉన్నాడు.


సి).విశ్వాసులు తిరిగి జన్మించినవారు (యోహాను 3:3; తీతుకు 3:5) విశ్వసించినవారు. ఒక క్రైస్తవుడు రక్షణను కోల్పోవటం అంటే జన్మించకుండా ఉండిన వాడై యుండాలి. నూతన జన్మను తీసివేయబడతాది అంటానికి బైబిలులో నిదర్శనాలు లేవు. డి). ప్రతి విశ్వాసులందరిలో పరిశుధ్ధాత్ముడు ఉంటాడు (యోహాను 14:17; రోమా 8:9). క్రీస్తు యొక్క ఒక్క శరీరములోనికి బాప్తిస్మమిస్తాడు. ఒక విశ్వాసి రక్షణను కోల్పోవాలంటే పరిశుధ్ధాత్ముడు అతనిని “విడిచి వెళ్ళిపోవాలి.” క్రీస్తు శరీరమునుండి వేరు చేయబడాలి.


ఇ).యేసుక్రీస్తు నందు విశ్వాసముంచినవారు “నిత్య జీవముకలవారని” యోహాను 3:16 తెల్పుతుంది.ఒక రోజు నీవు క్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే నీకు నిత్య జీవముంటుంది అయితే దానిని నీవు కోల్పోయినట్లయితే దానిని “నిత్యమైనది” అనలేము. కాబట్టి రక్షణను కోల్పోయినట్లయితే బైబిలులో నిత్య జీవమునకు సంభందించిన వాగ్ధానములు అబద్దములవుతాయి. ఎఫ్). వీటన్నిటిని ఆధారముచేసుకొని , ఈ వాదనలన్నిటిని రోమా 8:48-39 లో చూడగలము, “మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” నిన్ను రక్షించినటువంటి దేవుడే నిన్ను కాపాడతాడన్న మాటను ఙ్ఞాపకముంచుకో. ఒకసారి రక్షింపబడినట్లయితే ఎప్పటికి రక్షింపబడినట్లే. మన రక్షణ ఖచ్చితముగా నిత్యమూ భధ్రమే.

దేవుడు ఉన్నాడా ? ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఉందా?

సమాధానము: దేవుడు వున్నాడా? ఈ వాదనకి చాలా ఆసక్తి చూపించబడింది. ఇటీవల చేసిన పరిశోధనలను బట్టి ప్రపంచములోని 90 % ప్రజలు దేవుడు ఉన్నాడని లేదా ఒక మహా శక్తి అని నమ్ముతారు. ఏదైతేనేమి దేవుడున్నాడని నమ్ముతున్నా వాళ్లపై ఇది నిజంగా నిరూపించవలసిన భాద్యత ఉంచబడింది. ఇంకొక రకముగా ఆలోచిస్తే చాలా తర్కముగా అనిపిస్తుంది.


ఏమైనప్పటికి, దేవుడున్నాడని నిరూపించలేము అలా అని లేదని చెప్పలేము. బైబిలు చెప్పినట్లుగా విశ్వాసంతో దేవుడున్నాడన్న నిజాన్ని అంగీకరించాలని, “మరియు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉ౦డుట అసాధ్యమని, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” (హెబ్రీ 11.6). దేవుడు తలచుకుంటే ఆయన చాలా సూక్ష్మంగా ప్రపంచం అంతటా ప్రత్యక్షమై తాను ఉన్నాడని నిరూపించుకోగలడు. కానీ ఆయన అది చేస్తే, ఇంక విశ్వాసం యొక్క అవసర౦ లేదు. “యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని” అతనితో చెప్పెను (యోహాను 20.29).


ఏమయినప్పటికీ, దేవుడు ఉన్నాడనుటకు సాక్ష్యము లేదని, అర్థ౦ కాదు. "ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది; అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురి౦చుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఙానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు. మాటలు లేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలమానాలు భూమియందంతట వ్యాపించియున్నది. లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు వ్యాప్తి చె౦దియున్నవి” (కీర్తనలు 19: 1-4) నక్షత్రములను చూసినపుడు, విశాలమైన ఈ విశ్వాన్ని పరిశీలి౦చినపుడు, ప్రకృతి యొక్క అద్భుతాలను గమనించినపుడు సూర్యాస్తమయ అందాలను చూసినపుడు—ఇవన్నీ సృష్టి కర్త అయిన దేవుని సూచిస్తాయి. ఇవి కూడ చాలవు అనుకుంటే మనందరి హృదయాలలో దేవుడు ఉన్నారన్న సాక్ష్యం ఉ౦ది. ప్రసంగి (3.11) లో చెప్పినట్లుగా, ...“ఆయన శాశ్వత కాల జ్ఙానమును నరుల హృదయములో ఉ౦చి వున్నాడు…”. చాలా లోతుగా గుర్తిస్తే, ఈ జీవితం వెనుక ఏదో వుంది, మరియు ఈ ప్రపంచము వెనుక ఎవరో వున్నారు. మనము ఈ సమాచారాన్ని అర్థ౦ లేదని కొట్టివేసినా కాని, దేవుని సన్నిధి మనతో మరియు మన ద్వారా ఇ౦కా వుంది. ఇంకా దేవుడు లేడని ప్రక్కకి తోసివేసే వారితో (కీర్తన 14.1) లో చెప్పినట్లుగా “దేవుడు లేడని బుధ్ధిహీనులు, తమ హృదయములో అనుకుందురు”. 98 % పైగా ప్రజలు చరిత్ర, సంస్కృతి, నాగరికత, కల అన్ని ఖండాల వారు నమ్మేదేమిటంటే దేవుడువున్నాడని, ఈ నమ్మకము వెనుక ఏదో ఉ౦ది (లేదా ఎవరో ) ఉన్నారని.


బైబిలు వాదనల ప్రకారము దేవుడున్నాడని చూస్తే, తర్కపరమైన వాదనలు ఉన్నాయి. ప్రథమముగా, తర్కవిభేదమైన వాదము కలదు. ఈ తర్క విభేదానికి ముఖ్య అంశం ఏమిటంటే దేవుడున్నాడని నిరూపించటం. “ఆయనను మించిన మరే శక్తి లేదని” నిరూపించటంతో దేవుని గూర్చిన నిర్వచనం మొదలవుతుంది. ఈ వాదన ఎలా వుంటుందంటే ఆయన ఉనికి కన్నా ఇంకొక గొప్ప ఉనికి ఉందంటే అది ఎంత గొప్పదో బయటపడాలి. ఒకవేళ దేవుడు లేనట్లయితే ఆయన ఒక గొప్ప చలించే వ్యక్తి కాకపొతే దేవుని యొక్క ప్రతి నిర్వచనము విరుద్ధమైపోతుంది. రెండవది సరియైన వాదన ఏమిటంటే ఖచ్చితంగా ఈ విశ్వ సృష్టి వెనుక ఒక అద్భుతమైన దైవిక సృష్టి కర్త ఉన్నారని. ఉదాహరణకి భూమి సూర్యుడికి కొన్ని వందల మైళ్ళ దగ్గరగా గాని, లేదా దూరంగా ఉన్నట్లయితే , ప్రస్తుతం ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉ౦డేది కాదు. వాతావరణములో ఉన్న అణువులలో కనుక కొంచెం మార్పు ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయి ఉ౦డేది. 10,243 లో ఒక్క దానికే ప్రోటీన్ కణము అయ్యే అవకాశాలు ఉన్నాయి (2430 నుండి 10 వస్తాయి). ఒక్క కణము కొన్ని మిలియన్ల ప్రోటీన్ కణాలను కలిగి ఉంటుంది.


దేవుని ఉనికిని గూర్చిన మూడవ తర్కవాదన జగత్సంబంధమైన వాదన. ప్రతి పరిణామము వెనుక ఒక కారణము ఉ౦టుంది. ఈ విశ్వము మరియు సమస్తము ఒక ఏర్పాటే. ప్రతీది బయటకు అనగా ఉనికి లోనికి రావటానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణము ఉ౦డే ఉ౦టుంది. చిట్టచివరిగా చెప్పేదేమిటంటే సమస్తము ఉనికి లోనికి రావటానికి ఏదో తెలియని కారణము ఖచ్చితంగా ఉ౦డే ఉ౦టుంది. ఆ “తెలియని కారణమే” దేవుడు. నాల్గవ వాదన నీతి పరమైన వాదన. ప్రతి సంస్కృతి చరిత్ర అంతా ఒక విధమైన ధర్మశాస్త్రము తో ఏర్పాటయింది. ప్రతి మనిషికి మంచి, చెడు విచక్షణ కలవు. హత్య, అసత్యమాడటం, దొంగతనం మరియు అనైతికం వీటన్నిటిని విశ్వమంతా ఎప్పుడో త్రోసివేసింది. మరి పరిశుడైద్ధున దేవుని నుండి కాకపోతే మరి ఈ మంచి చెడు విచక్షణా జ్ఙానము ఎక్కడనుండి వచ్చాయి. వీటన్నిటిని ప్రక్కకు త్రోసివేసి, బైబిలు ఏం చెపుతుందంటే ప్రజలు సృష్టి౦చినవాటిని


మరియు ఉపేక్షించటానికి వీలు లేని దేవుని జ్ఙానమును నమ్మటానికి బదులు అసత్యమును నమ్మరు. రోమా 1:25 లో చెప్పినట్లుగా “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, మరియు సృష్టికర్తకు ప్రతిగా సృష్టి౦చినవాటిని


పూజించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్”. బైబిల్ ఇంకా ఏమని ప్రకటిస్తుందంటే (రోమా 1:20) “ప్రజలు ఏ సాకు లేకుండా దేవుని నమ్మటానికి బదులు—ఆయన అదృశ్య లక్షణములు,నిత్యశక్తియు, దైవత్వమును, స్పష్టముగా చూసి కూడ, ఎలా సృష్టించబడినవో అర్థము చేసుకుని కూడ నమ్మలేకున్నారు”.


ప్రజలు దేవుని యందు నమ్మకము లేదని చెప్పటానికి “శాస్త్రీయమైన” లేదా “సరియైన ఆధారము” లేక కాదు. నిజమైన కారణము ఏమిటంటే ఒకసారి దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నపుడు ఆయన ఇచ్చు అవసరమైన క్షమాపణ కొరకు ఆయన పట్ల బాధ్యులై ఉ౦డవలెనని గుర్తించాలి అనగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉ౦డాలి. (రోమా 3:23; 6:23). దేవుడు వున్నట్లయితే, మన క్రియల విషయమై మనము లెక్క అప్పచెప్పవలసినవారమై ఉన్నాము. ఒకవేళ దేవుడు లేనట్లయితే తీర్పు వస్తుందన్న చింత లేక మన ఇష్టానుసారంగా మనం చేయవచ్చు. సృష్టికర్తయిన దేవుడిని నమ్మటం అనే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వటానికి –మన సమాజంలో ఈ పరిణామము బలంగా పట్టుకుని వుంది. దేవుడు ఉన్నాడు మరియు ఆఖరికి ప్రతిఒక్కరికి తెలుసు ఆయన ఉన్నాడని. నిజమేమిటంటే కొంతమంది చాలా వాదనలతో కలహించి చివరకి ఆయన ఉన్నారన్న నిజాన్ని నిరూపించలేకపోయారు.


చివరగా దేవుడున్నాడని ఒకే ఒక వాదన వుంది. ఆయన ఉన్నాడని ఎలా తెలుస్తుంది? క్రైస్తవులుగా మనకి తెలుసు ఆయన ఉన్నాడని, ఎందుకంటే మనం ప్రతిరోజూ ఆయనతో మాట్లాడుతాం కాబట్టి. మనం ఆయన తిరిగి మాట్లాడటం వినకపోవచ్చు, కాని ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం, ఆయన నడిపించే అనుభూతి చెందుతున్నాం, మనకు ఆయన ప్రేమతెలుసు, ఆయన కృపను కోరుకుంటున్నాం. మన జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నా దేవుని కంటే ఎక్కువగా చెప్పటానికి మనదగ్గర ఏ ఇతర వివరణ లేదు. దేవుడు మనలను ఎంతో అద్భుతంగా రక్షించి మరియు మన జీవితాలను మార్చిన దానికి మనం ఆయనను అనుసరిస్తూ, ఆయన ఉనికిని స్తుతించటం తప్ప మనం ఏమి చేయలేము. ఈ వాదనలలో ఏ ఒక్కటీ వారిని కాని ఇతరులను కాని ఇంత స్పష్టముగా ఉన్నదానిని అనుసరి౦చటం ఎవరూ తప్పించలేరు. చివరికి దేవుని ఉనికిని విశ్వాసంతోనే అంగీకరించాలి. (హెబ్రీ 11.6). విశ్వాసం అనేది గుడ్డిగా చీకటిలోకి గంతు వేయటం కాదు, ఎక్కడ అప్పటికే 90 % ప్రజలు నిలబడి బాగా వెలిగించబడి ఉన్న గదిలోకి సురక్షితముగా అడుగుపెట్టటం.

క్షమాపణ లభించిందా? మనం దేవుని నుండి క్షమాపణ ఎలా పొందగలం?

సమాధానము: అ.కా. 13:38“సహోదరులారా, మీకు తెలియచేసే విషయం ఏమిటంటే యేసు క్రీస్తు ద్వారానే మీ పాపములు క్షమింపబడుతాయి” అని ప్రకటించబడింది.


క్షమాపణ అంటే ఏమిటి మరియు నాకెందుకది అవసరం?


“క్షమాపణ” అనే పదానికి అర్థ౦ పలకను శుభ్రంగా తుడిచివేయడం, క్షమించడ౦ , ఋణాన్ని రద్దు చేయటం అన్నమాట. మనము తప్పు చేసినప్పుడు తిరిగి మన సంబంధాలను కలుపుకోవటానికి క్షమాపణ కొరకు ఎదురుచూస్తాము. ఎందుకంటే ఒక వ్యక్తి క్షమించబడుటకు అర్హుడు అనుకున్న౦త మాత్రాన అతనికి క్షమాపణ ఇవ్వబడదు


క్షమాపణ అనేది ప్రేమ, దయ మరియు కనికరము అనే క్రియలతో కూడినది. క్షమాపణ అనేది మీకు ఏది చేసినప్పటికీ, ఎదుటి వ్యక్తికి వ్యతిరేకముగా వారు చేసినది ఏదైనా గట్టిగా పట్టుకోవటం కాదు.


బైబిల్ ఏం చెపుతుందంటే మన౦దరికీ దేవుని నుండి క్షమాపణ పొందవలసిన అవసరము ఎంతైనా ఉ౦ది. మనమందరము పాపము చేసాము. ప్రసంగి 7:20 లో, “పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు”. “1 యోహాను 1:8 లో మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొన్నట్లవును , మరియు మనలో సత్యముండదు”. కీర్తనలు 51:4 లో చెప్పినట్లుగా నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసియున్నాను, నీ దృష్టి యెదుట చెడుతనము చేసియున్నాను. దీని ఫలితమే, మనందరికి ఖచ్చితంగా క్షమాపణ అవసరమై ఉన్నది. మన పాపములు క్షమింపబడనియెడల (మత్తయి 25:46: యోహాను 3:36) ప్రకారము మన పాపముల విషయమై మనము నిత్యశిక్షకు పాత్రులగుదుము.


క్షమాపణ—అది నేను ఎలా తెచ్చుకోగలను?


కృతజ్ఙతపూర్వకంగా, దేవుడు ప్రేమ మరియు దయగలవాడు—ఆయన మన పాపములను క్షమించటానికి ఎంతో ఆసక్తి కలవాడు. 2 పేతురు 3.9 లో మనకు తెలుపుతుంది... “ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నారు”. ఆయన మనలను క్షమించాలని కోరుకుంటున్నారు, అందుకే మనకొరకు క్షమాపణ ఏర్పాటు చేసారు.


మన పాపములకు వెల కేవలము మరణము. రోమా మొదటి సగభాగంలో 6:23లో “పాపము వలన వచ్చు అపరాధము మరణము”…. మన పాపముల వలన మనము సంపాదించుకున్నది నిత్య మరణము. దేవుడు తన ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా యేసు క్రీస్తు రూప౦లో ఈ భూమి మీద అవతరించి మనకు రావాల్సిన శిక్షను శిలువపై చనిపోవుట ద్వారా మనకొరకు వెల చెల్లించారు. 2 కొరింథి 5:21 లో, "మనము ఆయనయందు దేవుని నీతి అగునట్లుగా, ఏ పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను”.యేసు శిలువ మీద చనిపోయి, మనకు చెందవలసిన శిక్షను ఆయన తీసుకొనెను. దేవుడిగా యేసు యొక్క మరణము సమస్త మానవాళి పాపములకు క్షమాపణ అందచేయబడినది! (1 యోహాను 2:2) ప్రకారము ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకపాపపరిహారము కొరకై త్యాగధనులై ఉన్నారు. ( 1 కొరింథి 15:1-28 ) యేసు మరణము నుండి లేచి, పాపము మరియు మరణము మీద విజయము సాధించారని ప్రకటించబడింది. దేవునికి స్తోత్రము, యేసు క్రీస్తు మరణము మరియు పునరుద్ధానము ద్వారా రోమా6:23 రెండవ భాగము లో చెప్పింది నిజము... “కాని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్యజీవనము అనే వరము అనుగ్రహించబడింది”.


మీకు మీ పాపములు క్షమించబడాలి అని ఉ౦దా? మీకు ఈ పాపముల నుండి పారిపోలేననే అపరాధ భావన మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? మీ విశ్వాసాన్ని మీ రక్షకుడైన యేసుక్రీస్తు మీద ఉ౦చిన ఎడల మీ పాపములకు క్షమాపణ అవకాశం కలుగుతుంది. ఎఫెసి 1:7 లో చెప్పినట్లుగా “ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు కలిగి యున్నది”. ఆయన మన అపరాధములకు వెల చెల్లించెను కాబట్టే మన పాపములు క్షమింబడినవి. యేసుద్వారా మీకు క్షమాపణ కలిగిందా అని అడిగితే---నాకు క్షమాపణ ఇవ్వటానికే యేసు చనిపోయారు అని నమ్మినయెడల ఆయన ఖచ్చితంగా మిమ్ములను క్షమిస్తారు. యోహాను 3.16,17 లో చెప్పిన అద్భుతమైన సమాచారము ఏమిటంటే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు ఇచ్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు".


క్షమాపణ—అది నిజముగా చాలా తేలికా?


అవును అది చాలా తేలిక! మీరు దేవునినుండి క్షమాపణ పొ౦దలేరు. దేవుని దగ్గర నుండి మీ క్షమాపణ కొరకు మీరు ఏమి చెల్లించలేరు. దేవుని కృప మరియు కనికరము ద్వారా విశ్వాసంతో మాత్రమే మీరు దానిని పొందగలరు. మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించి మరియు దేవుని వద్దనుండి క్షమాపణ పొందాలంటే ఈ ప్రార్థనను మీరు చేయవచ్చు. ఈ ప్రార్థన చెప్పటం వలన తప్ప మరి ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉ౦చుట ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ లభిస్తుంది. ఈ ప్రార్థన యేసు నందు మనకున్న విశ్వాసాన్ని వివరించటానికి మరియు ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణకు కృతజ్ఞతలు చెల్లించటానికి ఒక సులభమైన మార్గము మాత్రమే. “ప్రభువా! నాకు తెలుసు నేను మీకు విరోధముగా పాపము చేసాను మరియు నేను శిక్షకు పాత్రుడను. కాని యేసు క్రీస్తు నాకు చెందవలసిన శిక్షను తీసుకున్నారనే విశ్వాసం ద్వారా నేను క్షమించబడ్డాను. నా రక్షణ కొరకు నా నమ్మకాన్ని మీపై ఉ౦చుతాను. మీ అద్బుతమైన కృప మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు ! ఆమెన్ !”

ప్రశ్న: నిత్యజీవము కలుగుతుందా?

మాధానము: దేవునికి వ్యతిరేకముగా: రోమా (3.23) ప్రకారము “అందరూ పాపంచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు”. మనమందరము దేవునికి యిష్టము లేని పనులు చేసి శిక్షకు పాత్రులుగా ఉన్నాము. చివరకి మనం శాశ్వతమైన దేవునికి విరుద్ధ౦గా పాపంచేసినందుకు మనకు ఈ శాశ్వతమైన శిక్ష చాలు. రోమా (6:23) “ప్రకారము పాపం వలన వచ్చు అపరాధ౦ మరణం, కాని దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము”. 

ఎలాగైతే నేమి, (1 పేతురు 2.22) లో చెప్పినట్లుగా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మరియు ఆదియందు వాక్యముండెను,ఆ వాక్యము ఆయన రూపమై మనుషుల మధ్య నివసించెను, (యోహాను 1. 1, 14) “అద్వితీయ కుమారునిగా పుట్టి మన పాపములకై వెల చెల్లించెను. దేవుడు తన ప్రేమను ఇలా ప్రకటించెను.. మనము ఇంకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను”. (2 కొరింథి 5: 21) లో చెప్పినట్లుగా పాపమెరుగని ఆయన మనకొరకు పాపమై, మనము అనుభవించవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకుని శిలువ మీద చనిపోయెను.(1 కొరింథి 15.1-4) లో చెప్పినట్లుగా మూడవ దినమున మరణము నుండి లేచి మరణము మీద మరియు పాపము మీద విజయము సాధించానని నిరూపించారు. (1పేతురు 1:3) “ఆయన గొప్ప కృప చేత మనకు నిత్యజీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు మృతులలో నుండి తిరిగిలేచెను”.

అ.కా. (3.19) ప్రకారము మనము మారుమనస్సు పొంది విశ్వాసముతో ఆయనవైపు తిరిగినఎడల—ఆయన ఎవరు?, ఆయన ఏం చేసారు?, మరియు ఎందుకు రక్షణ ఇచ్చారు? అంటే మన పాపములు తుడిచివేయబడు నిమిత్తమై అని అర్థ౦. మనము ఆయన యందు విశ్వాసము ఉ౦చి, మన పాపములకై శిలువపై చనిపోయాడని నమ్మితే, మనము క్షమించబడి మరియు పరలోకములో మన కొరకు వాగ్దానము చేసిన నిత్యజీవమును అందుకోగలము. (యోహాను 3.16) లో చెప్పినట్లుగా “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”. ( రోమా 10:9) ప్రకారము “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు. క్రీస్తు శిలువలో సమస్తము పూర్తి చేసాడు అన్న విశ్వాసము ఒక్కటే నిత్యజీవానికి దారిచూపిస్తుంది. ఎఫెసి (2:8-9) “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవునివరమే. అది క్రియలవలన కలిగినది కాదు. కాబట్టి ఎవడును అతిశయింప వీలులేదు.

మీరు యేసుక్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఇక్కడ నమూనా ప్రార్థన కలదు. గుర్తుంచుకో౦డి, ప్రార్థన చెప్పటం వలన లేదా ఇంకా ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. క్రీస్తుని నమ్ముట ద్వారా మాత్రమే అనగా ఆ నమ్మకమే మీ పాపము నుండి రక్షిస్తుంది. ఈ ప్రార్థన మీకు యిచ్చిన రక్షణ గురించి స్తుతి చెల్లించటానికి మరియు ఆయనయందు మీకున్న విశ్వాసాన్ని వివరించి చెప్పే ఒక దారిమాత్రమే. “దేవా, నాకు తెలుసు, నేను మీకు విరోధముగా పాపము చేసి శిక్షకు పాత్రుడనయ్యాను. కాని క్రీస్తు నా శిక్షను తీసుకుని విశ్వాసం ద్వారా ఆయన ఇచ్చిన క్షమాపణకు అర్హుడనయ్యాను. నా నమ్మకాన్ని మీరు ఇచ్చిన రక్షణలో ఉ౦చుతాను. మీ అద్భుతమైన కృప మరియు క్షమాపణ –శాశ్వతమైన వరము నిత్యజీవము కొరకు ధన్యవాదములు. ఆమెన్".

 పాపం వలన వచ్చు జీతం మరణం, కాని దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవం

రోమా (6:23)



ఆయన గొప్ప కృప చేత మనకు నిత్యజీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు మృతులలో నుండి తిరిగిలేచెను

(1పేతురు 1:3)



దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను




(యోహాను 3.16)

మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవునివరమే. అది క్రియలవలన కలిగినది కాదు కాబట్టి ఎవడును అతిశయింప వీలులేదు

(ఎఫెసి 2:8-9)


యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు

(రోమా 10:9)


అద్వితీయ కుమారునిగా పుట్టి మన పాపములకై వెల చెల్లించెను. దేవుడు తన ప్రేమను ఇలా ప్రకటించెను.. మనము ఇంకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను

(రోమా 5:8)

Thank you for giving to the Lord


                                        
I dreamed I went to Heaven - You were there with me
We walked up on the streets of gold - beside the crystal sea
We heard the angels singing - then someone called your name
We turned and saw this young man - and he was smiling as he came
And he said "Friend, you may not know me know" Then he said "..But wait"
You used to teach my Sunday School - when I was only eight
Every week you would say a prayer - before the class would start
And one day when you said that prayer - I asked Jesus in my heart

Thank you for giving to the Lord - I am a life that was changed
Thank you for giving to the Lord - I am so glad you gave

Then other man stood before you - He said remember the time
A missionary came to your church - His pictures made you cry
You didn`t have much money - But you gave it anyway
Jesus took the gift you gave - and that`s why I am here today


Thank you for giving to the Lord - I am a life that was changed
Thank you for giving to the Lord - I am so glad you gave

One by one they came - far as the eye could see
Each life some how touched - by your generosity
Little things that you had done - Sacrifices made
Unnoticed on the earth - in heaven now proclaimed
I know up in Heaven - you`re not supposed to cry
But I am almost sure - there were tears in your eyes
As Jesus took your hand - you stood before the Lord
He said, "My Child look around you,  for great is your reward"


Thank you for giving to the Lord - I am a life that was changed
Thank you for giving to the Lord - I am so glad you gave
I am so glad you gave.